:-జాబితాలో పేరు రానివారు ఆందోళన చెందొద్దు

అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి
అర్హులైన లబ్ధిదారులకు నాలుగు ప్రభుత్వ పథకాలు అందిస్తామని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల మంజూరు తదితర పథకాలు 100% అమలు చేయుటకు కొఠారి గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా
ఆదివారం మండలంలోని కోఠారి గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులకు పత్రాలను అడిషనల్ కలెక్టర్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి లాంఛనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు.మం డలంలో కొఠారి
గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని, 100% అర్హులైన లబ్ధిదారులకు పథకాలను అందజేస్తామన్నారు.
గత నాలుగు రోజుల పాటు గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై అర్హులైన వారి జాబితాను గ్రామసభలో చదివి వినిపించడం జరిగిందన్నారు. జాబితాలో అభ్యంతరాలు, పేర్లు లేని ఆరులైన వారి నుండి దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ 100 శాతం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.అర్హులై ఉండి జాబితా లో పేరు రానటువంటి లబ్ధిదారులు మరల దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని వివరించారు. మాట్లాడుతూ గతంలో ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి వర్తింపజేయడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇల్లు 108, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 12 మంది, రైతు భరోసాలో 306 మంది, గతంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించిన రేషన్ కార్డుల లబ్ధిదారులకు 15 మందికి మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అంతకు ముందు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గ్రామపంచాయతీ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమం వద్ద ఎస్సై గుంపుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఎంపీడీవో అంజాద్ పాషా, తాసిల్దార్ దత్తు ప్రసాద్ రావు, మండల వ్యవసాయ శాఖ అధికారి యుగంధర్, పంచాయతీ కార్యదర్శి సతీష్ రావు, కాంగ్రెస్ నాయకులు మునీర్ హైమద్, లక్ష్మణరావు, కుసుం రావు, నానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.