కొమురం భీమ్ ఆసిఫాబాద్ పట్టణం లోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐ.పి.ఎస్
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు ప్రారంభమైన నేపథ్యంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ బుధువారం ఆయన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్ష కేంద్రాలు తగు జాగ్రత్తలు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత పరీక్షల పర్యవేక్షణ అధికారికి, పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన 19 పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఉన్నట్లు, 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలిపారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.