మండలంలోని ఏజెన్సీని సంపూర్ణంగా బంధు నిర్వహిస్తున్న తుడుం దెబ్బ ఆదివాసి నాయకులు మంగళవారం మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు ఇతరత్ర సంస్థలను ఆదివాసి నాయకులు సంపూర్ణంగా బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకులు మాట్లాడుతూ ఆదివాసులకు తరతరాలుగా అభివృద్ధి ఫలాలు అందడం లేదని, 70 ఏళ్ల స్వాతంత్ర సమాజంలో నేటికీ గిరిజన అభివృద్ధి పై ప్రభుత్వాలు మార్పు తీసుకురావడంలో విఫలమైందని, నేటికీ గిరిజన గ్రామాలలో విద్యా, వైద్యం, తాగునీరు, సాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారని, రహదారులు సక్రమంగా లేక నానా అవస్థలు పడుతూ బురదలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత పరిరక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని, జీవో నెంబర్ 3ను కొనసాగించాలని, ఐటీడీలోని బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఆదివాసి గిరిజనులకు గత సంవత్సరంలో మంజూరైన ట్రైకర్ లోన్లను మంజూరు చేసి వారి అభివృద్ధికి సహకరించాలని తదితర డిమాండ్ల తో సంపూర్ణ బంద్ నిర్వహిస్తున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా కోఆర్డినేటర్ గేడం సుభాష్, గణపతి, తుంరం భాస్కర్, గేడం సోనేరావు, అర్జు, కుర్సెంగా శోభన్, దుర్వా రవి, ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.