Friday, April 4, 2025
Homeఎడిటోరియల్ఒకే మండపంలో ఇద్దరు యువతులతో వివాహం..!

ఒకే మండపంలో ఇద్దరు యువతులతో వివాహం..!

– ముందుగానే శుభలేఖలను కూడా యువతుల పేర్లతో అచ్చు వేయించిన యువకుడు

జననినాదం, సిర్పూర్,U

ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం అరుదైన వివాహం జరిగింది. ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. ఇంకేముంది అతిథులు  తర్వాత ఆ జంటను.. సారీ, ముగ్గురు కదా, జంట అనలేం.. ఆ భర్త… భార్యలను అతిథులందరూ ఆశీర్వదించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ఫోటోలు, శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ యువకుడు ఇద్దరు యువతులతోనూ ప్రేమలో పడటం… ఆ విషయం తెలిసి కూడా ఇద్దరి యువతులు యువకుడితో కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నారు. ఓకే వేదికపై ఈ పెళ్లి తంతు జరగడం విశేషం. యువకుడు మామూలు రైతు కుటుంబంలో జన్మించాడు., మూడేళ్ల కిందట మొదలైన అతడి ప్రేమ ప్రస్థానం ఇలా సాగింది.. మొత్తం మీద ఈ వివాహం వేడుక జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


Discover more from jananinadam.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Contact Us on ?