జన నినాదం, తిర్యాణి 15
తిర్యాణి మండలంలోని కస్తూరిభా గాంధీ విద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి కె అంజయ్య పేర్కొన్నారు. కెజిబివి విద్యాలయంలో అటెండర్ పోస్ట్ ఒకటి, అసిస్టెంట్ కుక్ పోస్టులు రెండు, స్కావెంజర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అటెండర్ కు పదవ తరగతి విద్యార్హత కలిగి ఉండాలని అసిస్టెంట్ కుక్ అలాగే స్కావెంజర్ పోస్టులకు ఏడవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని, వీరు స్థానికులై 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20 తేదీ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కెజిబివి విద్యాలయం మాణిక్యాపూర్ లో దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తుతో విద్యార్హత సర్టిఫికెట్ తో పాటు బోనఫైడ్, కుల దృవీకరణ ,స్థానిక దృవీకరణ పత్రాలు జతచేయాలని ,మొత్తం మూడు సెట్లు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.