ఎంపీడీవో మల్లేష్
జననినాదం, తిర్యాణి 12
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని తిర్యాణి ఎంపీడీవో వేముల మల్లేష్ అన్నారు. గురువారం రోజున సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో స్థానిక ఎస్సై మాధవ్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతకులకు బహుమతులను అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు శరీర దృఢత్వనికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు ఎందరో ఉన్నత ఉద్యోగాలను సాధించారని గుర్తు చేశారు. జిల్లాలో జరగబోయే క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తిర్యాణి ఆశ్రమ పాఠశాల నుండి సైకిల్ పోలో పోటీలలో జాతీయ స్థాయికి ఎంపికైన నగేష్ అనే విద్యార్థికి జాతీయస్థాయి పోటీలలో పాల్గొనందుకు పిఎసిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ ఆర్దిక సహయాన్ని అందించి అతన్ని శాలువతో సన్మానించారు. అనంతరం తిర్యాణి పంచాయతీ కార్యదర్శుల తరఫున పంచాయతీ కార్యదర్శులు నగేష్ కు ఆర్థిక సహాయాన్ని అందించారు. తిర్యాణి మండలంలో క్రీడా ప్రాంగణం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని క్రీడ ప్రాంగణం ఏర్పాటుకు అధికారులు కృషి చేయాలని తిర్యాణి కి చెందిన పీటీలు, పీడీలు అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. సీఎం కప్ ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంజయ్య, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు సాంబశివరావు, పిడి లక్ష్మణ్, పిటిలు శ్రీనివాస్, సుభాష్, సుమలత వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.