ఆసిఫాబాద్ ఎస్ ఐ,బుద్దే రవీందర్ కి వినతి
* భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో
ఆసిఫాబాద్ మండలంలో రోజు రోజుకి విచ్చలవిడిగా యువతను ఆసరా చేసుకొని గంజాయి స్మగ్లర్లు దందా కొనసాగిస్తున్నారు, వాటికి బానిసైన యువత అగత్యాలకు అకృత్యాలకు దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ వారి కుటుంబాన్ని రోడ్డు పడుతున్నాయి, మత్తు మైకంలో యువత ఏమి చేయడానికైనా వెనకాడడం లేదు, గంజాయిని సేవిస్తున్నారని భారత ప్రజాపతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ ఎస్ఐ బుద్దె రవీందర్ గారికి వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో యువత పక్కదారి పడుతున్నారు, దానికి కారణం ప్రధానంగా గంజాయి, మరియు బెల్ట్ షాపులు, వ్యభిచార గృహాలు, వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, బెల్ట్ షాపులు రద్దీగా ఉన్న మార్కెట్లో మరియు పాఠశాలల వద్ద ఏర్పాటు చేయడం వల్ల అటు విద్యార్థులకు ఇటు ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి, కావున గంజాయి, బెల్ట్ షాపులు, వ్యభిచార గృహాల పై చర్యలు తీసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గెడం టికనంద్, జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ పాల్గొన్నారు,
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.