పెంచికల్ పేట్… మావోయిస్టులు వనాలను వొదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని కగజ్ నగర్ డీఎస్పీ రామానుజన్ అన్నారు. బుదవారం మండలంలోని అగర్ గూడా గ్రామంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశాల మేరకు పోరు కన్న.. ఊరు మిన్న కార్యక్రమంలో భాగంగా మావోయిస్టు చౌదరి అంకుబాయి కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు, బట్టలు,దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అజ్ఞాతంలో ఉండి సాధించేది ఏమీ లేదని, లొంగిపోతే పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. అనారోగ్యంతో ఉన్న చికిత్స అందిస్తామని అడవుల్లో ఉండి సాధించేది ఏమీ లేదని ఆయన అన్నారు. అజ్ఞాతంలో ఉంటూ ఎంతో కాలంగా కుటుంబాలకు దూరంగా ఉన్నారు. ఇప్పటికైనా మీ ఊరు చేరి.. మీ కుటుంబాలతో సంతోషంగా జీవించండని ఆయన అన్నారు. ప్రజలంతా ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నారని, దీనిని అర్థం చేసుకుని ఆయుధాలు వీడి స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు తమ పేరుమీద ఉన్న రేవర్డ్ తోపాటు ఐదు ఎకరాల భూమి, ఆటో లేదా ట్రాక్టర్ తదితర జీవనోపాధి కల్పనను కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ రూరల్ సీ.ఐ శ్రీనివాస రావు , ఎస్.ఐ అసరి. కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.