అహింసా సిద్ధాంతానికి పునాది వేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహరాజ్
సేవాలాల్ మహారాజ్ అందించిన సేవలు చిరస్మరణీయం
సేవాలాల్ ఆచరించిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొవాలి
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 27 (జన నినాదం):
అహింసా సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపిన మహనీయుడు సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహరాజ్ అని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం సంత్ సేవాలాల్ 285వ జయంతిని పురస్కరించుకొని మందమర్రి మండలం గద్దెరాగడిలో గల శ్రీనివాస గార్డెన్స్ సమీపంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్తో కలిసి హాజరై బంజారా సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాల్గొని మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. అహింసా సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపించారని, బంజారా జాతిని సన్మర్గంలో నడిపించేందుకు తన బోధనల ద్వారా విశేష కృషి చేశారని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం కోసం అనేక ఉద్యమాలు చేశారని, ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడిలు అరికట్టడం, క్షేత్రధర్మాన్ని రక్షించడం లాంటి అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని తెలిపారు. సంత్ సేవాలాల్ ఆచరించిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి గంగారాం, సంబంధిత శాఖల అధికారులు, బంజారా సంక్షేమ సంఘం అధ్యక్షుడు సబావత్ శంకర్, సంఘం ప్రతినిధులు తదితరుల పాల్గొన్నారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.