వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమాన గ్రామ శివారులో మంగళవారం మధ్యాహ్నం పేకాట స్థావరాలపై వాంకిడి ఎస్ఐ ప్రశాంత్, టాస్క్ ఫోర్స్ ఎస్సై తో కలసి దాడులు నిర్వహించారు. ఖమాన గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఖమాన గ్రామానికి చెందిన 1.లోబడే బాపురావు(40), 2.మస్నే సంతోష్,(33), 3.మస్నే తుకారాం, (42),4.అదే అనిల్,(35) 5.బామ్నే రాఘవ (36) 6.బండె చంద్ర శేఖర్ (19) 6 గురిని వాంకిడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 3200/- నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ ఐ ప్రశాంత్ మాట్లాడుతూ అదుపులోకి తీసుకున్న ఆరుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా గ్రామంలో పేకాట, మట్కా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.