జన నినాదం, బెజ్జూర్ 16
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వింత
సంఘటన వెలుగుచూసింది. సృష్టికి విరుద్దంగా ఓ గేదెకు వింత దూడ జన్మించింది. ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా మూడు నాలుకలతో దూడ జన్మించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. శనివారం ఉదయం బెజ్జూరు మండల కేంద్రానికి చెందిన మేకల పర్వతాలుకు చెందిన గేదె మూడు నాలుకలతో ఉన్న వింత దూడకు జన్మిచ్చింది.దీంతో కంగారు పడిన రైతు మండల పశువైద్యాధికారిడాక్టర్ రాకేష్ కు సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటనపై స్పందించిన డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ.. జన్యుపరమైన లోపంతోనే ఇలాంటి వింత జననాలు సంభవిస్తాయని తెలిపారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువులు ఎదకు వచ్చినప్పుడు మందలో వదలకుండా, పశు వైద్యశాలకు తరలించాలని చెప్పారు. మందల్లో ఇతరత్రా మగ పశువులతో కలవడం వల్ల ఇలాంటి జన్యు లోపాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ పశువైద్యశాలల్లో పశువులకు వీర్యం అందుబాటులో ఉందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కాగా, ఈ వింత దూడను చూసేందుకు మండల ప్రజలు రైతు మేకల పర్వతాలు ఇంటికి క్యూ కట్టారు. ఈ దూడను చూసిన ప్రజలు బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నిజమవుతుందని అభిప్రాయపడుతున్నారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.