చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా కలిసికట్టుగా జరుపుకునే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహం నింపుతుంది.
అటువంటి ఈ పండుగలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించని కారణంగా ప్రతి ఏటా ఏదో ఒకచోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
అప్రమత్తంగా ఉండడమే శ్రీరామరక్ష అనే ఉద్దేశంతో గణేష్ మండప నిర్వాహకులకు కొన్ని సూచనలు చేయడమైనది.
👉మట్టితో తయారుచేసిన విగ్రహాలను పూజించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి పర్యావరణానికి హానికరించే విధంగా ఉన్న వస్తువులను వినియోగించరాదు
👉విగ్రహం సైజు బరువు ఉత్సవం ఎన్ని రోజులు నిర్వహిస్తారు నిమజ్జనం తేదీ మరియు కమిటీ సభ్యుల వివరాలను ముందుగానే పోలీసువారికి తెలియజేయాలి మరియు ఆన్లైన్ చేయించాలి
👉బలవంతపు వసూలు చేయరాదు ఎవరైనా అటువంటి వసూళ్లు చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకోబడును
👉విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అనుభవజ్ఞులైన వారి ద్వారా విద్యుత్ కనెక్షన్లు చేయించుకోవాలి విద్యుత్ శాఖ వారి సలహాలు సూచనలు పాటించాలి వారి సహాయ సహకారాలు తీసుకోవాలి
👉వినాయక మండప ఏర్పాటు విషయంలో గ్రామపంచాయతీ లేదా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి మరియు విద్యుత్ శాఖ వారి పర్మిషన్ తీసుకొని మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి
వివాదాస్పద స్థలాల్లో మండపాలు నిర్మించ రాదు.
👉కమిటీ సభ్యులలో కనీసం ఇద్దరూ రాత్రి సమయాలలో మండపాల వద్ద కాపలాగా ఉండే విధంగా చూసుకోవాలి రాత్రి సమయాలలో చిన్న పిల్లలను వృద్ధులను వినాయక మండపాలలో పడుకొనివ్వరాదు
👉వినాయక మండపాల వద్ద అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరిగినచో వాటికి నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది
👉 ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మైకులు వినియోగించాలి ఇతర మతాలు కులాలను కించపరిచే విధంగా పాటలు వేయరాదు అలాగే అసభ్య కరమైన పాటలు పెట్టారాదు
👉మండపాల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలి మరియు ఇరుకైన గల్లీలలో మండపాలను ఏర్పాటు చేయరాదు
👉అత్యవసర సేవలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ ను (100 పోలీస్ అంబులెన్సు -108 )మండపంలో అందరికీ కనిపించే విధంగా నోటీసు బోర్డు పెట్టాలి
👉మండపాలలో ఎలాంటి మండే స్వభావం ఉన్న పదార్థాలు లేదా పటాకులు ఉంచరాదు. నూనెతో వెలిగించే దీపాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని వాటి తీవ్రతను తగ్గించే విధంగా సరిపడా ఇసుక నీటిని అందుబాటులో ఉంచుకోవాలి
👉 నిమజ్జనం రోజు నా ఉదయం పది గంటల నుండి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి వినాయక నిమజ్జనం రోజున ఊరోగింపునకు నిర్దేశించిన సమయంలోపు పూర్తయ్యేలా చూసుకోవాలి పోలీసు వారి సూచనలు పాటించాలి
👉విగ్రహం ట్రాన్స్పోర్ట్ సమయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి సాధ్యమైనంతవరకు చిన్న విగ్రహాలను అందరు మోసే విధంగా ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి.
👉 ప్ప్రొసెషన్ జరుగుతున్న సమయం లో వాలంట్టేర్లను నియమించుకోవాలి, ఉత్సవ కమిటీ సభ్యులు తప్పకుండ విగ్రహం తో పాటు ఉండాలి.
👉 గణేష్ మండపమ్ దగ్గర గాని ఊరేగింపు లో గాని డీజే ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించారాదు
👉ముస్లిం ప్రేయర్స్ సమయాల్లో గణేష్ మండపాల వద్ద మైక్ లు ఆఫ్ చేయవలెను అలాగే ఊరేగింపు జరుతున్న సమయం లో ముస్లిం ప్రేయర్ల సమయం లో ఎలాంటి సౌండ్ లేకుండా మసీద్ లు దాటించ వలెను
👉 చిన్న పిల్లలను నిమజ్జనం దగ్గరకు తీసుకు వెళ్ళరాదు.
👉మందు తాగి నిమజ్జనం లో పాల్గొన రాదు అలాంటి వారిని నిమజ్జనం స్థలమునకు రాకుండా చూసుకోవాలి
👉పోలీసులు మరియు పెద్దలు సూచించిన రూట్ ని మాత్రమే వినియోగించ వలెను , మరియు నిర్ణయించన ప్రదేశం లోనే నిమజ్జనం చేయవలెను
ప్రతి ఒక్క మండపం వద్ద ఒక చెకింగ్ పుస్తకం పెట్టవలెను, ఎవరైనా తనిఖీ కి వచ్చినప్పుడు దానిలో ఎంట్రీ పెట్టించ వలెను
👉 గల్లీలలో ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఎదురేదురుగా విగ్రహాలు రాకుండా చూసుకోవలెను
👉 ప్రతి గణేష్ మండలి 10 మంది వాలంటీర్లను సమకూర్చు కోవలెను వారికి ఒక బనియన్ కానీ ఒక T షర్ట్ గాని లేక వాలెంటీర్ అని గుర్తు పట్టే విదంగా రిబ్బన్ కానీ ఉండవలేను.

Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.