:- జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
జిల్లాలో జరుగుతున్న గ్రూప్-3 పరీక్షల నిర్వహణ కొరకు స్ట్రాంగ్ రూమ్ నుండి పరీక్ష పత్రాలను పటిష్ట భద్రత మధ్య తరలించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన పరీక్ష పత్రాలు, ఓ. ఎం. ఆర్. షీట్లను కేటాయించిన ప్రకారం జిల్లాలో ఏర్పాటుచేసిన 18 పరీక్ష కేంద్రాలకు తరలించే ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్, నోడల్ అధికారి దీపక్ తివారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రూట్ అధికారులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు పరీక్ష పత్రాలు, ఓ. ఎం. ఆర్. షీట్లను పటిష్ట భద్రత మధ్య నిర్ణీత సమయంలో తరలించి ఆయా పరీక్ష కేంద్రాల ముఖ్య పర్యవేక్షకులకు అందజేయాలని ఆదేశించారు. ఇల్లాలు కేటాయించిన కేంద్రాలకు కోడ్ ప్రకారం పత్రాలను అందజేయాలని, ఇలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. మధ్యాహ్నం జరిగే పేపర్-2 ప్రశ్న పత్రాలను సైతం నిర్ణీత సమయంలో అందజేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త లక్ష్మీనరసింహ, రూట్ అధికారులు, ముఖ్య పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.