హట్టి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పల్లెనిద్ర(హాస్టల్ బస) చేస్తున్న జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
:- మెనూ,బోధన తీరుపై ఆరా
:- పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలలో ఒకరోజు విద్యార్థులతో కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే శుక్రవారం మండలంలోని అట్టి ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.విద్యార్థుల పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. తరగతుల వారిగా విద్యాబోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.మధ్యాహ్నం, సాయంత్రం మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఫిజిక్స్ సబ్జెక్టు చదువుతుండగా సంబంధిత ఉపాధ్యాయుడిని బోధన తీరు వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. రాత్రిపూట ఏ సమయం వరకు చదువుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో ఏం కావాలనుకుంటున్నారనే విద్యార్థులను ప్రశ్నించగా ఓ విద్యార్థి ఐఏఎస్ కావాలని అనుకుంటున్నాను అని సమాధానం ఇవ్వడంతో అందుకు కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటినుండే కఠోర సాధన మొదలుపెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఓ విద్యార్థి వేసినటువంటి చిత్రలేఖనాన్ని పరిశీలించారు. చదువుతోపాటు విద్యార్థులు అన్ని రంగాల్లో సృజనాత్మకతను పెంపొందించుకోవాలన్నారు. పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల్లో వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం డైనింగ్ హాల్‌ను తనిఖీ చేశారు. డైనింగ్ హాల్ లోని సౌకర్యాలను పరిశీలించి. అధికారులతో మాట్లాడి పాఠశాల స్టాఫ్, విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో మాట్లాడి రోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? లేదా? అని, ఇతరత్రా వారికున్న సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో
వారితో కలిసి భోజనం చేశారు. పాఠశాల డార్మెటరీలో విద్యార్థినులు, ఉపాధ్యాయులతో కలిసి రాత్రి అక్కడే నిద్రించారు. కార్యక్రమంలో డిడి రమాదేవి, విద్యాధికారి ఆడే ప్రకాష్, ఎంపీడీవో అంజాద్ పాషా, డిప్యూటీ తాసిల్దార్ సంతోష్ కుమార్, ఇన్చార్జ్ ఎస్ఐ అంజయ్య, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పంచ పూల, ఆర్ ఐ పవన్, పంచాయతీ కార్యదర్శులు, ఈశ్వర్, సతీష్ రావు , గణేష్ ఉన్నారు.

Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.