త్రు టిలో తప్పిన ప్రమాదం
గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్ళు దగ్ధమైన సంఘటన ఆదివారం కెరమెరి మండలం లోని తుమ్మగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కో లాం గూడా లో చోటుచేసుకుంది. గ్రామ స్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్రం బారిక్ రావు అను వ్యక్తి వార సంత కావడం తో మండల కేంద్రానికి వెళ్ళాడు. అయన భార్య చేను పనులకు వెళ్లడం తో ఇంటి వద్ద పిల్లలు మాత్రమే ఉన్నారు.మధ్యాహ్న సమయం లో గ్యాస్ సిలెండర్ లికేజి ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పిల్లలు బయట ఆడుకుంటుండడం ప్రాణప్రాయం నుంచి బయటపడ్డారు.ఈ సంఘటనలో బారి క్ రావు ఇళ్ళు పూర్తిగా దగ్ధం కాగా, పక్కనే ఉన్న ఇళ్ళు పాక్షికంగా కాలిపోయింది.మంటల్లో ప్రిజ్, ఎల్ ఈ డీతో పాటు నగదు, తో పాటు నగలు కాలిపోయినట్టు తెలిపారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.